ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం చేరుకున్న సంజీవని బస్సులు - corona tests in sanjeevani buses news update

రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు నిమిత్తం ఏర్పాటు చేసిన సంజీవని బస్సులు ప్రకాశం జిల్లాకు చేరుకున్నాయి. ఇంద్ర బస్సులకు సంజీవని అని పేరు మార్చి, ల్యాబ్‌ల మాదిరిగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కో బస్సులో ఒకే సారి 10 మందికి పరీక్షలు నిర్వహంచడానికి వీలుగా బస్సులను తీర్చిదిద్దారు.

Sanjeevani buses reaching Prakasam district
ప్రకాశం చేరుకున్న సంజీవని బస్సులు

By

Published : Jul 15, 2020, 5:06 PM IST

కరోనా పరీక్షల కోసం ఆర్టీసి రూపొందించిన సంజీవని ప్రత్యేక బస్సులు ప్రకాశం జిల్లాకు చేరుకున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లా కలెక్టర్‌ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఐదు బస్సులు కేటాయించింది. వీటిలో ఒంగోలు డిపోకు మూడు, మార్కాపురం డిపోకు రెండు బస్సులు చేరుకోగా వీటిల్లోనే ప్రయాణికులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వడం వల్ల... ఫలితాలు వేగవంతం కాగలవనే ఉద్దేశ్యంతో వీటిని జిల్లాకు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details