కరోనాను కట్టడి చేసేందుకు ప్రకాశం జిల్లా చీరాలలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చీరాల కూరగాయల మార్కెట్ వద్ద కరోనా వైరస్ నిరోధక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ రహదారిలో వచ్చిపోయేవారిపై.. వైరస్ నాశక రసాయనాలు పైనుంచి తుంపరలు తుంపరలుగా పడుతుంటాయి. ఫలితంగా కరోనా నివారణకు అవకాశం కలుగుతుందని చీరాల మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అన్నారు. మార్కెట్ రహదారిలొ వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ ద్వారం నుంచే రాకపోకలు చేయాలని కోరారు.
చీరాల మార్కెట్లో శానిటైజర్ గేటు
కరోనాను నియంత్రించేందుకు అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. ప్రకాశం జిల్లా చీరాల కూరగాయల మార్కెట్ వద్ద కరోనా వైరస్ నిరోధక ద్వారాన్ని ఏర్పాటు చేశారు.
చీరాలమార్కెట్లో శానిటైజర్ గేటు