ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తన వంతు సాయం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ. 3.25 లక్షలు అందించారు. మత్తుకు బానిసైన వారిని గుర్తించి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ నగదును స్థానిక ప్రజా ప్రతినిధుల చేత అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
శానిటైజర్ తాగి మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం - కురిచేడు తాజా వార్తలు
కురిచేడులో శానిటైజర్ తాగి మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పరామర్శించారు. సోమవారం బాధితుల ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
![శానిటైజర్ తాగి మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం sanitizer drunk and died people families given 25 thousand rupees by kurichedu mla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8294071-599-8294071-1596553855432.jpg)
శానిటైజర్ తాగి మృతి చెందిన కుటుంబాలకు నగదు అందిస్తున్న స్థానిక ప్రజా ప్రతినిధులు