ఇసుక అక్రమంగా తరలిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని.. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెడతామని ప్రకాశం జిల్లా ఇంకొల్లు సి.ఐ రాంబాబు హెచ్చరించారు. మూడు రోజుల క్రితం మోటుపల్లి ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు, ట్రాక్టర్లను చినగంజాం, వేటపాలెం పోలీసులు పట్టుకున్నారు.
చినగంజాం ప్రాంతాల్లొ 2014 సంవత్సరం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న 23 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. వేటపాలెం, మోటుపల్లి, చినగంజాం, పెదగంజాం, కడవకుదురు రహదారుల్లొ పోలీసులు నిరంతరం గస్తీ తిరుగుతుంటారని చెప్పారు.