ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయం స్థలంలో ఇసుక అక్రమ రవాణా?

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో సచివాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలోని ఇసుకను అక్రమార్కులు తీసుకెళుతున్నారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

sand illegal transport in prakasam dst vetapalem
sand illegal transport in prakasam dst vetapalem

By

Published : Aug 26, 2020, 7:20 PM IST

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయితీ పరిధిలోని రెండో సచివాలయ నిర్మాణానికి... రావూరి రోడ్డులో ఉన్న అంజనేయస్వామి దేవాలయం వెనుక స్థలాన్ని గతంలో అధికారులు కేటాయించారు. నాలుగు రోజుల క్రితం ఆ స్థలాన్ని చదునుచేసి పిల్లర్ల నిర్మాణానికి బెడ్లు వేశారు. ఈ క్రమంలో వచ్చిన ఇసుకను అక్కడే కుప్పలుగా పోశారు.

కొందరు వ్యక్తులు వేకువజామున ఈ ఇసుకను ట్రాక్టర్లతో తరలించి సొమ్ముచేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయితీ రాజ్ ఏఈని వివరణ కోరగా చల్లారెడ్డిపాలెం సచివాలయం నిర్మాణానికి ట్రాక్టర్ ఇసుక అవసరమై తీసుకెళ్లామన్నారు. ఆ ప్రాంతంలో పనులు రద్దు కాలేదని చెప్పారు. ఇనుప చువ్వలు రాని కారణంగానే పనులు ఆగాయని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details