ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 13 వాహనాలు స్వాధీనం - ప్రకాశం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా

ప్రకాశం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. తాళ్ళూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 13 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

sand illegal mining at prakasham district
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 13 వాహనాలు స్వాధీనం

By

Published : Jul 18, 2020, 4:50 PM IST

ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముండ్లమూరు మండలంలోని పోలవరం వద్ద ఉన్న 5వ నెంబర్ ఇసుక రీచ్ నుంచి... ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

సుమారు 234 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 13 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వాటిని స్టేషన్ కు తరలించినట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details