కరోనా కాలంలో ఇసుకాసురులు జోరుగా అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రభుత్వాలు విధించే ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దర్శి మండలంలోని బండివెలిగండ్ల గ్రామం వద్ద గల మూసీ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
కురిచేడుకు ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు.