ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రద్దీగా చీరాల కూరగాయల మార్కెట్ - చీరాలలో లాక్ డౌన్ వార్తలు

ప్రకాశం జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతోంది. చీరాల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 24 వార్డు సచివాలయాల్లో కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. మార్కాపురంలో నిత్యావసరాలు తెచ్చుకునేందుకు ఉదయం 7 గంటల నుంచి 9 వరకు పోలీసులు అనుమతిచ్చారు.

rush in  Vegetable market  at prakasham
కూరగాయల మార్కెట్​లో రద్దీ

By

Published : Mar 26, 2020, 9:58 AM IST

చీరాలలో కూరగాయల మార్కెట్ రద్దీ

కరోనా నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉగాది పర్వదినం సందర్భంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్ రద్దీగా మారింది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రజల రద్దీని తగ్గించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 24 వార్డు సచివాలయాల్లో కూరగాయల దుకాణాలు ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతంలోనే కూరగాయలు కొనుక్కోవాలని అధికారులు సూచించారు.

మార్కాపురంలో..

మార్కాపురంలో కూరగాయల మార్కెట్ రద్దీ

మార్కాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు లాక్ డౌన్ పాటిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సరుకులు, కూరగాయలు తెచ్చుకునేందుకు ఉదయం 7 గంటల నుంచి 9 వరకు పోలీసులు అనుమతిచ్చారు. మార్కెట్​కు అధికంగా ప్రజలు కూరగాయల కోసం తరలివస్తున్న కారణంగా రద్దీ ఎక్కువవవుతోంది. ఈ కారణంగా మార్కెట్ ను జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం తొమ్మిది దాటిన వెంటనే పోలీసులు అక్కడి నుంచి ప్రజలను పంపించివేస్తున్నారు.

ఇదీ చూడండి:

చీరాలలో కఠినంగా లాక్​డౌన్ అమలు చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details