10 గంటల్లో 100కిలోమీటర్లు పరుగెత్తిన అథ్లెట్ - gold medal
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అథ్లెట్.... పది గంటల్లో వంద కిలోమీటర్లు పరుగు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.
run
ప్రకాశం జిల్లా... బెస్తవారిపేటకు చెందిన కసినబోయిన మహేష్.... గురువారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు పరుగు ప్రారంభించి.... శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పూర్తిచేశాడు. ఆర్మీలో చేరాలనే ఆసక్తితో పరుగు సాధన చేసిన మహేష్.... ఐదు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తొలి ఐదు స్థానాల్లో నిలిచాడు. 2020లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. మరింత సాధన చేస్తే 8 గంటల్లోనే 100 కిలోమీటర్ల పరుగును పూర్తి చేస్తానని చెప్పాడు.