ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాకు బల'రామ్ రామ్'!.. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత - rumours on tdp karanam balaram

చీరాల తెదేపా ఎమ్మెల్యే పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

rumours of  tdp karanam
తెదేపాకు బల'రామ్ రామ్'!.. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత

By

Published : Mar 12, 2020, 7:49 AM IST

తెదేపా సీనియర్ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి పార్టీ మారటానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారంతో జిల్లాలో విస్తృతంగా కొనసాగుతోంది. వైకాపా నేతలతో ఆయన చర్చలు జరిపారని, ఒకటి రెండు రోజుల్లో కుమారుడు వెంకటేష్​తో కలిసి వారి పార్టీలో చేరతారని బుధవారం ఆయన సన్నిహితులు తెలిపారు. జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేత, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంగళవారం వైకాపా తీర్థం పుచ్చుకోగా తాజాగా బలరాం విషయం చర్చనీయాంశమైంది. దీనిపై ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. వెంకటేష్​ను ప్రశ్నించగా ఆహ్వానం ఉందని ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.

ఇవీ చూడండి-వైకాపా గూటికి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

ABOUT THE AUTHOR

...view details