ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అధికార పార్టీ నేతలు.. దగ్గరుండి నడిపించిన పోలీసులు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో అధికార పార్టీ నాయకులు ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారు. కోడ్ అమల్లో ఉండగా ర్యాలీలు నిర్వహించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ycp leaders violated the election code at markapur
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అధికార పార్టీ నేతలు

By

Published : Mar 3, 2021, 6:35 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారు. ఓ పార్టీకి చెందిన నాయకుడు వైకాపాలో చేరిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున 10 మంది ఒక చోట ఉండే అవకాశం లేదు.

ఇలాంటి సమయంలో అధికార పార్టీ.. పాటలతో ర్యాలీ నిర్వహించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా కోడ్ అమల్లో ఉన్నప్పడు ఏవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే వాళ్లను బైండోవర్ చేసే పోలీసులు సైతం.. ఆ ర్యాలీని దగ్గరుండి నడిపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details