ప్రకాశం జిల్లా ఆర్టీసీ ఆర్ఎం కార్యాయం వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తాము విధులకు హాజరవ్వద్దని అధికారులు నోటీసులు ఇచ్చారని... ఈ కారణంగా ఉపాధి కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో అంతా ఒక చోట చేరి నిరసన వ్యక్తం చేసే అవకాశం లేదన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.