ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమ జంటపై దాడి చేసిన కేసులో నిందితుడి అరెస్టు - bike

వివిధ దోపిడీ కేసులకు సంబంధించి నలుగురు నిందితుల్ని ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 లక్షలకు పైగా నగదు, 3 కేజీల గంజాయి, ఆటో, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులతో పోలీసులు

By

Published : May 7, 2019, 8:44 AM IST

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

ఏప్రిల్ నెలలో ప్రకాశం జిల్లా మంగమూరు రోడ్డు శివారు ప్రాంతంలోని జామ తోటలో ఓ జంట పై దాడి చేసి 12 వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీ సహా నగరంలో ద్విచక్ర వాహనం దోపిడీ చేసిన సాతులూరి కృష్ణ అనే నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. అతను బంగారు ఆభరణాలు విక్రయించడానికి సహకరించిన పవన్ సాయి కుమార్​నూ పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీ చేయగా వచ్చిన డబ్బుతో విశాఖలో గంజాయి కొని ఒంగోలులో విక్రయించడానికి యత్నిస్తుండగా సాతులూరి కృష్ణ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుదు ఇంతకు ముందూ చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడని ఒంగోలు డీఎస్పీ రాధేశ్ మురళి వెల్లడించారు. కృష్ణకు సహకరించిన పెద బాబుతో పాటు ఆతని స్నేహితుడు శ్రీనులను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
3 లక్షలకుపైగా నగదు స్వాధీనం
నగరంలోని ఓ వసతి గృహంలో చరవాణి దొంగతనాలకు పాల్పడిన సాయి పవన్ కుమార్ అనే నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 14 చరవాణి లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన తాళ్లూరు కోటయ్య అనే వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు అదేవిధంగా నగరంలో ఆటో దొంగతనాలకు పాల్పడుతున్న సయ్యద్ బాబు అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు అతని వద్ద నుంచి ఆటోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వేర్వేరు కేసుల్లో నలుగురు నిందితుల నుంచి మూడు లక్షల 20 వేల రూపాయలు విలువ చేసే సొత్తును 3 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details