ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో కారుని ఆపి దారి దోపిడీ... - ప్రకాశం జిల్లాలో దుండగుల బీభత్సం

Robbery: దోర్నాల మండలం యడవల్లి సమీపంలో దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. ఓ కారును ఆపి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Robbery
దారి దోపిడీ

By

Published : May 18, 2022, 2:23 PM IST

Robbery: దుండగులు కారును ఆటకాయించి నగదును దోచుకెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం యడవల్లి సమీపంలో చోటుచేసుకుంది. గుజరాత్ కు చెందిన ఇద్దరు కోల్​కత్త నుంచి కర్ణాటకలోని హౌస్ పేటకు వెళ్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో దోర్నాల మండలం యడవల్లి వద్ద మరో కారులో వచ్చిన దుండగులు.. బెదిరించి కారును ఆపారు. పక్కనే ఉన్న బలిజెపల్లి రహదరిలోకి కారును మళ్లించి కొంతదూరం వెళ్లిన అనంతరం కారులోని నగదును దోచుకెళ్లారు. బాధితుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్ద మొత్తంలో నగదు దోపిడీకి గురై ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details