ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కఠిన ఆంక్షలు విధించారు. ఫలితంగా పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు ప్రజలెవరూ బయటకు రాకుండా కర్ఫ్యూ విధించారు. ఎవరైనా ఆ సమయంలో బయటకు వస్తే క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరించారు.
కరోనా వైరస్... కనిగిరిలో నిర్మానుష్యంగా మారిన రహదారులు
ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి నివారణకు పోలీసులు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. ఫలితంగా పట్టణంలోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కనిగిరిలో నిర్మానుష్యంగా మారిన రహదారులు