ప్రకాశం జిల్లా చీరాల ఆర్ఓబీపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా నిజాంపట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఏపీ 07 బీఎస్ 2799 నెంబరు కారులో.. కారంచేడు వైపు నుంచి చీరాల వస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న కారు చోదకుడు స్థానిక రైల్వే వంతెనపైకి వచ్చేసరికి పూర్తిగా అదుపుతప్పాడు. ముందుగా డివైడర్ను.. అటుపై రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ల మీద ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ద్విచక్రవాహనాలను ఢీకొన్న కారు.. ఒకరు మృతి - చీరాల రోడ్డు ప్రమాదం
మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో భీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ జయంతిపేటకు చెందిన అల్లడి అశోక్ కుమార్ (44) మరణించాడు. మృతుడు ఈపురూపాలెం వీఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్నాడు. మిగిలిన ఇద్దరిని సాల్మన్ పేటకు చెందిన చిమటా చంద్రశేఖర్, బోయినవారిపాలెంకు చెందిన వాలంటీర్ బోయిన జగదీశ్గా గుర్తించారు. విషయం తెలుసుకున్న చీరాల ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ కేసు నమోదు చేసుకుని చోదకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండీ..పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆందోళన.. వేడిమిని తట్టుకోలేక ఇబ్బందులు