ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై ప్రమాదం... ఒకరు మృతి - ప్రకాశం జిల్లా వార్తలు

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోనంకి - బొల్లాపల్లి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడిని బొల్లాపల్లికి చెందిన వేణుబాబు (27) గా గుర్తించారు.

road accident one died
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

By

Published : Jul 20, 2021, 9:02 AM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లికి చెందిన వేణుబాబు (27) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కోనంకి - బొల్లాపల్లి జాతీయరహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై కోనంకి వైపు నుంచి స్వగ్రామానికి వస్తూ వేణుబాబు ప్రమాదానికి గురయ్యాడు. అదుపు తప్పి పడిపోయాడా... ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీ కొని మృతి చెందాడా అనే విషయాలు తెలియరాలేదు.

అపస్మారక స్దితిలో పడి ఉన్న వేణుబాబును అటుగావస్తున్న స్థానికులు గమనించి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని వద్ద లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details