ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రేణింగవరంఫ్లై ఓవర్ వద్ద కారు వేగంగా వస్తూ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మృతుడిని సురకంటి యామిరెడ్డి(44)గా స్థానిక పోలీసులు గుర్తించారు. రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.