ROAD ACCIDENT: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జె.పంగులూరు మండలం రేణంగివరం వద్ద కట్టెల లోడును తీసుకవెళ్తున్న ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన తండ్రి కొడుకులు సౌదా వెంకట్రావు, ప్రసన్నలుగా పోలీసులు గుర్తించారు. కారు వేగంగా రావటంతో కట్టెల లోడు కింద ఇరుక్కుపోయింది. గంటపాటు శ్రమించి పోలీసులు కారులోని మృతదేహాలను బయటకు తీయించారు.
ROAD ACCIDENT: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి - ప్రకాశం జిల్లా నేర వార్తలు
ROAD ACCIDENT: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను...కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
Last Updated : Jan 27, 2022, 11:53 AM IST