ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి భువనేశ్వర్‌కు అల్లం లోడుతో వెళ్తున్న లారీ.. మార్టూరు మార్కెట్ సమీపంలో ఆగివున్న టిప్పరును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన లారీ డ్రైవర్ నరేంద్ర(40) లారీ క్యాబిన్లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. క్లినర్ చందుకు గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టిప్పర్‌ను ఢీకొన్న లారీ...డ్రైవర్ మృతి
ప్రకాశం జిల్లా మార్టూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పరును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా క్లీనర్‌కు గాయాలయ్యాయి.
టిప్పర్‌ను ఢీకొన్న లారీ...డ్రైవర్ మృతి