బావిలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురికి గాయలు - road accident news in salakalaveedu
ప్రకాశం జిల్లా సలకలవీడు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఇన్నోవా కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బైక్ను తప్పించబోయి బావిలోకి దూసుకెళ్లిన కారు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సలకలవీడులో రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుంచి గుంటూరుకు వెళ్తున్న ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.