ప్రకాశం జిల్లా కనిగిరి మండలం యడవల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు వల్ల అదుపుతప్పిన కారు... రైలింగ్‌ను దాటి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పూణే నుంచి మాచవరంలోని బంధువుల ఇంటికి వస్తుండగా... ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు - latest road accident news in prakasam district
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం యడవల్లి సమీపంలో.. జాతీయ రహదారిపై కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడగా... చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
road accident in prakasam district
TAGGED:
yadavalli road accident news