ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ బోల్తా.. డ్రైవర్​కు గాయాలు - ప్రకాశం వార్తలు

పత్తి గింజల లోడుతో వెళ్తున్న లారీ... ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా కొట్టింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో డ్రైవర్​కు గాయాలయ్యాయి.

road accident in Prakasam District at Parchuru Zone
లారీ బోల్తా.. డ్రైవర్​కు గాయాలు..

By

Published : Jan 3, 2021, 3:47 AM IST

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెం వద్ద లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్​కు గాయాలయ్యాయి. గుంటూరు నుంచి చీరాలకు పత్తి గింజల లోడుతో వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ఘటన జరిగింది. విత్తనాల బస్తాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో చీరాల - పర్చూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పర్చూరు పోలుసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో రహదారికి అడ్డంగా ఉన్న లారీని తొలగించి, రాకపోకలు పునరుద్ధరించారు.

ఇదీ చదవండి:

'మంత్రి సమక్షంలో.. మత్స్యకార గ్రామాల సమస్యలను పరిష్కరిస్తాం'

ABOUT THE AUTHOR

...view details