ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు కర్ణాటకలోని బళ్ళారి వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులు చీమకుర్తిలో సమీప బంధువు అంత్యక్రియలకు వెళ్లి తిరిగివస్తుండగా కొత్తపల్లి వద్ద... వీరి వాహనాన్ని లారీ బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
కారును ఢీకొన్న లారీ... నలుగురు మృతి - ongole road accident news
కారును లారీ ఢీకొట్దింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లి సమీపంలో జరిగింది.
![కారును ఢీకొన్న లారీ... నలుగురు మృతి కారును ఢీకొన్న లారీ... ఇద్దరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5346103-594-5346103-1576119690329.jpg)
కారును ఢీకొన్న లారీ... ఇద్దరు మృతి
కారును ఢీకొన్న లారీ... నలుగురు మృతి
Last Updated : Dec 12, 2019, 12:14 PM IST