ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. టెంపో వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురు వాహనంలో చిక్కుకుని.. తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో టెంపో నుజ్జనుజ్జయింది. వీరందరూ నెల్లూరు నుంచి గుంటూరు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంవల్లే ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
డ్రైవర్ నిద్ర మత్తు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
టెంపో వాహనం మరో వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ వద్ద జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవర్ నిద్ర మత్తు.. రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి