ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సై జీపు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు - bike accident new in markapuram

బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి జీపు బైక్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో హర్షద్​ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారడంతో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

ఎస్సై వాహనం ఢీ కొని... ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలు
ఎస్సై వాహనం ఢీ కొని... ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలు

By

Published : Jan 26, 2020, 8:11 PM IST

ఎస్సై జీపు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారిపేట ఎస్త్సె రవీంద్రారెడ్డి... తుర్లపాడు నుంచి మార్కాపురానికి జీపులో వెళ్తున్నాడు. వాహనాన్ని మార్కాపురం కోర్టు కూడలి వద్ద యూ టర్న్ తీసుకున్నారు. సిగ్నల్స్ వేయకపోవటంతో అటుగా వస్తున్న బైక్​ను పోలీసు జీపు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు హర్షద్​కు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారటంతో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details