ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

By

Published : Aug 8, 2021, 9:36 PM IST

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రంగాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటుమాలకు చెందిన పురిణి బాలకృష్ణ తన పనులను ముగించుకుని కొత్తపట్నం నుంచి మోటుమాల వెళ్తున్నారు. అదే సమయంలో.. మోటుమాల నుంచి ద్విచక్రవాహనంపై కొత్తపట్నం వెళ్తున్న మల్లవరపు దుర్గాప్రసాద్, మేకల శ్రీను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం.. బాలకృష్ణ వాహనాన్ని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో.. బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన మల్లవరపు దుర్గాప్రసాద్​ను 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ అతను సైతం మృతి చెందాడు. గాయపడిన మేకల శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details