ప్రకాశ జిల్లా దర్శిలో రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. లంకోజనపల్లి సాగరు కాలువ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు... మృతుడు యర్రగొండపాలెం మండలం వొదంపల్లి గ్రామానికి చెందిన తిరుమలయ్యగా గుర్తించారు. క్రిస్మస్ పండుగ కోసం అత్తగారింటికి వచ్చిన తిరుమలయ్య.. భార్య మరియమ్మతో కలిసి సరకులు కొనటానికి బైక్పై మార్కెట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. ఘటనలో మరియమ్మకు గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దర్శిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - road accident news in dharshi
క్రిస్మస్ పండగకు అత్తవారింటికి వచ్చిన తిరుమలయ్య అనే వ్యక్తి భార్యతో కలిసి బైక్పై వెళ్తుండగా... గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరియమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది.
దర్శిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి