రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకున్ని వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు బంధువులు. అయితే ఆ యువకుడు మద్యం మత్తులో ఉండడం వల్ల వైద్యులకు కాసేపు చుక్కలు చూపించాడు. అతనికి వైద్యం చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు కాళ్ళు చేతులు పట్టుకొని వైద్యం ముగించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం సమీపంలో ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శేఖర్ అనే యువకుడు పూటుగా మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తూ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. గాయపడిన మరో ఇద్దరికి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్సనందించారు.
వైద్యం వద్దంటూ డాక్టర్లకే చుక్కలు చూపించాడు! - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాద వార్తలు
మద్యం తాగిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆటోని ఢీకొన్నాడు. ఈ ఘటనలో తనతో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తే వైద్యులకు చుక్కలు చూపించాడు. నాకు వైద్యం వద్దంటూ మొండిగా ప్రవర్తించాడు.
road accident at sithanagulavarm in prakasham district