ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సలీం మృతి చెందాడు. డ్వామా కార్యాలయం దగ్గర రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ ను వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. శ్రీశైలం నుండి ఒంగోలు వెళ్తున్న పెళ్లి బృందం కారు ఢీకొట్టింది. కారులో ఉన్న పెళ్లి కుమారుడుతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మరో నలుగురుకి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఒంగోలు వైద్యశాలకు తరలించారు. మూడు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఘటనా స్థలాన్ని మార్కాపురం డిఎస్పీ, సీఐ పరిశీలించారు.
రాయవరం వద్ద రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - markapuram
ప్రకాశం జిల్లా రాయవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.
రోడ్డుప్రమాదం