ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు
09:34 January 02
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బొలేరో వాహనం
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామం దగ్గర ఆగి ఉన్న లారీని వెనక నుంచి ప్యాసింజర్తో వెళ్తున్న వాహనం ఢీ కొట్టింది. వాహనంలో పదిమంది ప్రయాణిస్తుండగా వారిలో ఇద్దరు మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నలుగురిని ఒంగోలు తరలించారు. వీరంతా హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రామాపురం గ్రామం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న గిద్దలూరు సీఐ సుధాకర్ రావు, బేస్తవారిపేట ఎస్సై బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఘటన జరిగినట్లు మెుదట ప్రచారం జరిగింది.
ఇదీ చదవండి: