ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - ప్రకాశం జిల్లాలో ఎదురెదురుగా ఢీకొన్న కారు-ఆటో
14:09 March 24
AP Crime News: ఎదురెదురుగా ఢీకొన్న కారు-ఆటో
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో.. ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. దుర్ఘటనలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. మిర్చి కోతకు కూలీలు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు.. కారులో ఉన్న వారిలో ఒకరు మృతి చెందారు. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:చదువుల తల్లిని చంపేశారా.. వైకాపా నేత కూతురి కోసం దారుణం!?