మార్టూరు జాతీయరహదారిపై ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కృష్ణా జిల్లా కానూరుకు చెందిన కత్తి శ్రీనివాస్ మృతి చెందాడు. ఒంగోలు వైపు వెళ్తున్న అతడు.. వేగాన్ని అదుపు చేయలేక రోడ్డుపై పడ్డాడు. ప్రమాదంలో తలకు, రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. మార్టూరు ఎస్ఐ చౌడయ్య చికిత్స నిమిత్తం... తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిస్స పొందుతూ.. పరిస్థితి విషమించి.. శ్రీనివాస్ మృతిచెందాడు.
మార్టూరు జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి - road accident at marturu national high way
ప్రకాశం జిల్లా మార్టూరు జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
మార్టూరు జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం