ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూల్ డ్రింక్స్ కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు - మేదరమెట్ల వద్ద ప్రమాదం

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

road accident at medhara metla
మేదరమెట్ల వద్ద ప్రమాదం

By

Published : Apr 29, 2020, 12:34 PM IST

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది.. గాయాలపాలైన వారికి ప్రాథమిక చికిత్స అందించారు.

మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్​కు తరలించారు. మృతుడిని జే.పంగులూరు మండలం రాణింగివరం గ్రామానికి చెందిన మహేశ్​(22)గా గుర్తించారు. మేదరమెట్ల నుంచి శీతల పానీయాలు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details