ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపక్క ఆగి ఉన్న కారును ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఆటో చోదకుడు శివన్నారాయణకు, కారు నడుపుతున్న బాపట్లకు చెందిన కృష్ణమోహన్, మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అంబులెన్స్ రావటం ఆలస్యం కావడంతో తీవ్రగాయాలతో రోడ్డుపక్కన పడివున్న శివన్నారాయణను ఎస్సై సుధాకర్ తన జీప్లో ఎక్కించుకుని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.