జాతీయరహదారిపై ద్విచక్రవాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన బాలుడు కవ్వాడి సాయి(4)గా స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం కడవకుదురు సమీపంలో జరిగింది. చీరాల నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం అతివేగంగా వచ్చి... రోడ్డు దాటుతున్న చిన్నారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చినగంజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జాతీయరహదారిపై ప్రమాదం... బాలుడు మృతి - చినగంజాం మండలం తాజా రోడ్డు ప్రమాదం వార్తలు
ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కడవకుదురు సమీపంలో రోడ్డు దాటుతున్న చిన్నారిని ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ద్విచక్రవాహనం ఢీకొని బాలుడు మృతి