ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బైపాస్ రహదారిలో జరిగింది. వాడరేవు నుంచి సున్నపు వెంకటేష్ (30) అనే యువకుడు వేటపాలెం వైపు బైపాస్ రోడ్డులో వెళ్తున్న క్రమంలో చల్లారెడ్డిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. వేటపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను ఢీ కొన్న లారీ... ఒకరు మృతి - వేటపాలంలో బైక్ను ఢీ కొన్న లారీ
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదం