ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి సమస్య తీర్చాడని.. గుర్రంపై ఎమ్మెల్యే ఊరేగింపు... - ఎమ్మెల్యేను గుర్రం మీద ఊరేగించిన గ్రామస్థులు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో ఆర్వో ప్లాంటును సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు ప్రారంభించారు. నీటి సమస్య తీర్చారన్న ఆనందంలో గ్రామస్థులు.. ఎమ్మెల్యేను గుర్రం మీద ఊరేగించారు.

ro plant open at naguluppalapadu
ఆర్వో ప్లాంటు ప్రారంభించిన ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు

By

Published : Jan 1, 2021, 5:03 PM IST

Updated : Jan 1, 2021, 5:57 PM IST

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో ఆర్వో ప్లాంటును సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు ప్రారంభించారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా స్థానికంగా పైపు లైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో నీటి కోసం గ్రామస్థులు నానా అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతిధుల సహకారంతో రూ. 11 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్వో ప్లాంటును ఎమ్మెల్యే ప్రారంభించారు. నీటి సమస్య తీర్చారన్న ఆనందంలో గ్రామస్థులు .. ఎమ్మెల్యేను గుర్రం మీద ఊరేగించారు.

గ్రామంలో ఇంటింటికీ నీటి సరఫరా చేసేందుకు మారేళ్ల బంగారు బాబు.. తండ్రిమారేళ్ల వెంకటేశ్వర్లుజ్ఞాపకార్థం ఆటోను విరాళంగా ఇచ్చారు. ఈ కార్య్రమంలో పలువురు వైకాపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్వో ప్లాంటు ప్రారంభించిన ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు
Last Updated : Jan 1, 2021, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details