ప్రకాశం జిల్లా ఒంగోలులో పశ్చిమ బంగ, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల ఇబ్బందులను సీపీఎం నాయకులు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు వారికి బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కక్కరుగా ఉంటే 5 కిలోలు బియ్యం, అరకిలో కందిపప్పు.. కుటుంబంతో ఉంటే 15 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
సీపీఎం నేతల చొరవతో వలస కూలీలకు నిత్యావసరాలు
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఫలితంగా వలసకూలీలు, కార్మికులు, పేదలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలులో వలస కూలీల అవస్థను గమనించిన సీపీఎం నేతలు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. వారికి నిత్యావవసరాలు అందేలా చేశారు.
ఒంగోలులో వలస కూలీలకు బియ్యం పంపిణీ