మార్చి 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ప్రకాశం జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారిణి కృష్ణవేణి సూచించారు. చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో ఎన్నికల విధులకు హజరుకానున్న ఉద్యోగులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
'మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి' - prakasam district latest news
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులకు ప్రకాశం జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారిణి కృష్ణవేణి సూచించారు. చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి
మున్సిపాలిటి పరిధిలో జరిగే ఎన్నికలను సమర్థవంతగా జరిగేలా చూడాలన్నారు. ప్రతీ పౌరుడు తమ ఓటు హక్కుని వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో పురపాలిక కమిషనర్ యేషయ్య, తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్, డీఎస్పీ శ్రీకాంత్, ఇతర ఆధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:మార్చి 10వ తేదీన సెలవు ప్రకటించండి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశం