ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ కార్యాలయంలో భద్రంగా ఉండవలసిన "భూ"రికార్డులు.. ఓ సెలూన్లో దర్శనమిచ్చాయి. గొల్లపాలెేనికి చెందిన ఎలిశెట్టి శ్రీనివాసరావు, కురిచేడుకు చెందిన రహంతుల్లా.. సెలూన్లో రెవెన్యూ రికార్డులు తిరగేస్తుండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. గొల్లపాలెేనికి చెందిన శ్రీనివాసరావు గ్రామానికి చెందిన వార్డు మెంబరు. కురిచేడుకు చెందిన రహంతుల్లా అనిశా వలలో చిక్కి సస్పెండైన వీఆర్ఓకి సహాయకుడిగా పనిచేశారు. ఆ పరిచయాలతోనే వీరు భూ రికార్డులను బయటకు తెచ్చినట్లు గ్రామస్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం సమగ్ర "భూ" సర్వే నిర్వహిస్తున్న తరుణంలో రికార్డులు బయటి వ్యక్తుల చేతిలో తారస పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
భూరికార్డులు బార్బర్ షాపులో .. ఎక్కడంటే..!
భద్రంగా ఉండాల్సిన భూరికార్డులు భార్బర్ షాపులో దర్శనమిచ్చాయి. సస్పెండైన ఓ వీఆర్ఓ సహాయకుడిగా పనిచేసిన వ్యక్తి చేతిలో ఇవి తారసపడ్డాయి. సెలూన్లో రెవెన్యూ రికార్డులు తిరగేస్తుండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
భూరికార్డులు బార్బర్ షాపులో .. ఎక్కడంటే