ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో.. వృద్ధురాలికి అంత్యక్రియలు - కొరటమద్ది గ్రామంలో వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించిన రెవెన్యూ అధికారులు

ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. అదే సమయంలో కుటుంబసభ్యులకు కరోనా సోకింది. బంధువులెవరూ ఆమె అంత్యక్రియలు నిర్వహించటానికి ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు.. ఆమె అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.

Funeral for the old woman
వృద్ధురాలికి అంత్యక్రియలు

By

Published : May 26, 2021, 12:59 PM IST

అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధురాలికి అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు రెవిన్యూ అధికారులు. కర్నూలు జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామానికి చెందిన లక్ష్మి దేవమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. లక్ష్మిదేవమ్మ కుమారుడితో పాటు మనుమడు మరో ఇద్దరు కరోనా సోకి అనారోగ్యంతో ఉన్నారు.

ఈ క్రమంలో.. ఆ వృద్ధురాలి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గడివేముల మండల తహాసీల్దార్ నాగమణి, పంచాయతీ కార్యదర్శి సలీం, వీఆర్వో వెంకట కృష్ణ, వీఆర్ఎ చంద్ర.. కలిసి ఆమెకు అంత్య క్రియలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details