ప్రకాశం జిల్లా కనిగిరిలో పంచాయతీ కార్యదర్శులకు వీఆర్వోల మధ్య వార్ నెలకొంది. పంచాయతీ కార్యదర్శుల నుంచి డీడీఓ అధికారం, సచివాలయ సేవల పర్యవేక్షణ బాధ్యతలు బదలాయింపుపై వీఆర్వోలు.. పంచాయతీ కార్యదర్శులకు మధ్య వాగ్వాదం జరిగింది. వీఆర్వోలు ఇప్పటికే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని.. అటువంటివారికి డీడీఓ అధికారం ఇవ్వడం ఏమిటని.. పంచాయతీ కార్యదర్శుల సంఘం బహిరంగా మాట్లాడి, దూషించారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్ వర్సెస్ పంచాయతీరాజ్ శాఖ..! - Kanigiri Latest News
ప్రకాశం జిల్లా కనిగిరిలో రెవెన్యూ డిపార్ట్మెంట్-పంచాయతీరాజ్ శాఖల మధ్య మాటల యుద్ధం జరిగింది. 'మీరు అవినీతిపరులంటే... కాదు మీరే లంచగొండి వారు' అని ఒకరినొకరు దూషించుకున్నారు. సాక్ష్యాత్తు ఎంపీడీవో ముందే ఇలా గొడవకు దిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది. పంచాయతీ కార్యదర్శుల మాటలపై వీఆర్వోల సంఘం బాధ్యులు అభ్యంతరం చెప్పారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్ వర్సెస్ పంచాయతీరాజ్
దీనిపై వీఆర్వోం సంఘం నాయకులు అభ్యంతరం తెలిపారు. తాము అవినీతిపరులం కామని పంచాయతీ కార్యదర్శులే అవినీతిపరులని ఎదురుదాడి చేశారు. కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడివో మల్లికార్జునరావు సమక్షంలో ఈ వాగ్వాదం జరిగింది. ఎంపీడీవో ఇరువురికి సర్దిచెప్పి పంపించారు.
ఇదీ చదవండీ... అర్హులకు కచ్చితంగా సంక్షేమ పథకాలు అందాలి: సీఎం జగన్