ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"వసతుల కొరతపై దృష్టి పెట్టకుండా.. అవినీతి పెరిగిపోతోందని ప్రచారమేంటి?" - రెవెన్యూ శాఖపై బురద జల్లుతున్నారన్న రెవెన్యూ సంఘం అధ్యక్షుడు

Bopparaju: ప్రభుత్వం సౌకర్యాల లేమితో పాటు వసతుల కొరతపై ఏమాత్రం దృష్టిపెట్టకుండా.. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోతోందని ప్రచారం చేయడం ఏంటని.. ఆ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అవినీతి ఏ వ్యవస్థలో లేదన్న ఆయన.. కావాల్సిన సౌకర్యాలను కల్పించకుండా ఉద్యోగులు శుద్ధంగా ఉండాలంటే ఎలా అని నిలదీశారు.

Bopparaju
బొప్పరాజు వెంకటేశ్వర్లు

By

Published : Apr 23, 2022, 4:25 PM IST

Bopparaju: రెవెన్యూ శాఖ తరఫున అన్ని పనులూ ఆన్‌లైన్‌లోనే చేస్తున్నామని రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. సర్వర్‌లో సమస్య వస్తే తామే బాధ్యత వహించాల్సి వస్తోందని వాపోయారు. సర్వర్‌ పనిచేయకపోయినా రెవెన్యూ ఉద్యోగులదే బాధ్యతా? అని ప్రశ్నించారు. సర్వర్‌ సమస్యపై ఏ ఉన్నతాధికారి పట్టించుకోరని.. బాధ్యత మాత్రం రెవెన్యూ అధికారులపైనే వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల మండలాలకు నెట్‌వర్క్‌ ఎలా వస్తుందో చెప్పాలని నిలదీశారు.

బొప్పరాజు వెంకటేశ్వర్లు

పెద్ద పట్టణాల్లోనే నెట్‌వర్క్‌ సరిగా రాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని స్పష్టం చేశారు. నెట్‌వర్క్‌ మెరుగుపరచాలని కోరితే పట్టించుకోరని మండిపడ్డారు. సాఫ్ట్‌వేర్‌లో తప్పులు వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందని.. సర్వర్‌ సమస్యతోపాటు విద్యుత్‌ కోతలు వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యుత్‌ బిల్లులు కట్టలేదని సరఫరా ఆపేస్తున్నారని తెలిపారు. సాంకేతిక అంశాలపై కూడా తామే బాధ్యత వహించాలా? అని ప్రశ్నించారు. సిబ్బంది, శిక్షణ, కనీస సౌకర్యాలు ఈ మూడు అంశాల్లో సమస్యలే ఉన్నాయని రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఒంగోలులో మీడియాతో ఆయన మాట్లాడారు.

" రెవెన్యూ శాఖ తరఫున అన్నీ పనులు ఆన్‌లైన్‌లోనే చేస్తున్నాం. సర్వర్‌లో సమస్య వస్తే మేం బాధ్యత వహించాల్సి వస్తోంది. సర్వర్‌ సమస్యపై ఏ ఉన్నతాధికారి పట్టించుకోరు. మారుమూల మండలాలకు నెట్‌వర్క్‌ ఎలా వస్తుందో చెప్పాలి. పెద్ద పట్టణాల్లోనే నెట్‌వర్క్‌ సరిగా రాక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నెట్‌వర్క్‌ మెరుగుపరచాలని కోరితే పట్టించుకోరు. సాఫ్ట్‌వేర్‌లో తప్పులు వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. సర్వర్‌ సమస్యతో పాటు విద్యుత్‌ కోతలు వేధిస్తున్నాయి. సాంకేతిక అంశాలపైనా మేము బాధ్యత వహించాలా?." - బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సంఘం అధ్యక్షుడు

ఇదీ చదవండి: UTF: సీపీఎస్‌ రద్దుపై సీఎం ప్రకటన చేయకుంటే సీఎంవోను చుట్టుముడతాం: యూటీఎఫ్

ABOUT THE AUTHOR

...view details