ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవత్వం చాటుకున్న విశ్రాంత ఉద్యోగులు.. ఊరి కోసం వాటర్ ప్లాంట్

వారంతా విశ్రాంత ఉద్యోగులు.. ఊరి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని గ్రహించి.. మినరల్ వాటర్ ప్లాంట్​ను ఏర్పాటు చేయించారు. వారిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంతరావురులో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
సంతరావురులో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

By

Published : Sep 12, 2021, 4:50 PM IST

పుట్టి పెరిగిన ఉరికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు ఆ విశ్రాంత ఉద్యోగులు... తాగేందుకు శుద్ధజలం కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని శుద్ధ జలకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సంతరావూరు ఎస్సీ కాలనీలో 20 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జలధారను విశ్రాంత ఉద్యోగులు ప్రారంభించారు.

తాము పుట్టిపెరిగిన ఊరి కోసం మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఒంగోలు శర్మ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యుడు మెంటా సాల్మన్, తూర్పుగోదావరి జిల్లా ఫైర్ ఆఫీసర్ చిక్కాల రత్నబాబు, తెదేపా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు దేవతోటి నాగరాజు, పలువురు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సరుగుడు మొక్కల పెంపకంపై కుదరని సయోధ్య.. కొనసాగుతున్న 144 సెక్షన్

ABOUT THE AUTHOR

...view details