ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వీవర్స్ కాలనీలో విశ్రాంత ఏఎస్ఐ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో సురేంద్ర అనే రౌడీషీటర్ శనివారం రాత్రి గొడవ చేస్తుండగా.. విశ్రాంత ఏఎస్ఐ సూదనగుంట నాగేశ్వరరావు అతన్ని వారించి పంపించేశాడు. అది మనసులో పెట్టుకున్న సురేంద్ర అర్ధరాత్రి నాగేశ్వరరావు ఇంటికొచ్చి కర్రతో కొట్టటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈపురుపాలెంలో విశ్రాంత ఏఎస్ఐ హత్య - ఈపురుపాలెంలో విశ్రాంత ఏఎస్ఐ హత్య వార్తలు
ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వీవర్స్ కాలనీలో విశ్రాంత ఏఎస్ఐ హత్యకు గురయ్యాడు. సురేంద్ర అనే రౌడీషీటర్ అతన్ని చంపినట్లు పోలీసులు నిర్ధరించారు.
ఈపురుపాలెంలో విశ్రాంత ఏఎస్ఐ హత్య