రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో..బక్రీద్ పండుగ నిర్వహణపై అధికారులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ముస్లిం మత పెద్దలతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు.
'ఎవరికి వారు ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలి' - కనిగిరి వార్తలు
ప్రకాశం జిల్లా కనిగిరి పోలీసులు ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. బక్రీద్ పండుగ సందర్బంగా ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరికి వారు ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలని కోరారు.
బక్రీద్: ఎవరికి వారు ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలి
కనిగిరిలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని.. అందువల్ల ముస్లిం సోదరులు ఎవరికి వారు ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలని... ఈద్గాలకు వెళ్ళరాదని తెలిపారు. పరిస్థితులను బట్టి మరో వారం రోజులు లాక్డౌన్ను పొడిగించే అవకాశం ఉందని.. అందరూ సహకరించాలని తెలిపారు.
ఇదీ చదవండి మద్య విమోచన కమిటీ ఏం చేస్తోంది: పవన్ కల్యాణ్