ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ కథనానికి స్పందన.. ఉప్పు ఎగుమతులకు అధికారుల అనుమతి - ఉప్పు ఎగుమతి వార్తలు

కరోనా కష్టకాలంలో ఉప్పు పరిశ్రమ వేలాది మంది కూలీలను అదుకుంటోంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా కూలీలకు జీవనోపాధి కూడా కష్టంగా మారటంతో... వారు పడుతున్న ఇబ్బందులు... ఏప్రిల్ 18న " కరోనా దెబ్బతో నష్టపోతున్న ఉప్పు రైతులు" ఈటీవీ జైకిసాన్, ఈటీవీ భారత్ లలో కథనం ప్రసారమైంది. దీంతో అధికారులు స్పందించి ఉప్పు ఎగుమతులకు అనుమతులిచ్చారు.

response to etv story on for salt exports in prakasam district
ఉప్పు ఎగుమతులకు అధికారుల అనుమతి

By

Published : Jul 28, 2020, 11:03 AM IST

కరోనా కష్టకాలంలో ఉప్పు పరిశ్రమ వేలాది మంది కూలీలను అదుకుంటోంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఇతరత్రా పనులు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నవారికి ఉప్పు కొఠార్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రకాశం జిల్లా చినగంజాం పరిధిలోని... చినగంజాం, సోపిరాల, రాజుబంగారుపాలెం, పెదగంజాం, పల్లెపాలెం ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రవేటు ఆధీనంలోని మూడు వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. పంట కాలంలో రైతులు ఎకరాకు 500 క్వింటాళ్ల ఉప్పు తీస్తారు. ఏప్రిల్ 15 వరకు 1500 ఎకరాల సాగులో సుమారు 3లక్షల క్వింటాళ్ల ఉప్పు తీశారు.

లాక్ డౌన్ కారణంగా ఉప్పును అమ్ముకోలేక రైతులు సతమతమవుతున్నారు. కూలీలకు జీవనోపాధి కూడా కష్టంగా మారటంతో... వారు పడుతున్న ఇబ్బందులు... ఏప్రిల్ 18న " కరోనా దెబ్బతో నష్టపోతున్న ఉప్పు రైతులు" ఈటీవీ జైకిసాన్, ఈటీవీ భారత్ లలో కథనం ప్రసారమైంది.. దీంతో అధికారులు స్పందించి మే నెలలో ఉప్పు ఎగుమతులకు అనుమతులిచ్చారు. అప్పటినుంచి స్థానిక అధికారుల పర్యవేక్షణలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కూలీలు కొఠార్లలో పనిచేస్తున్నారు. క్వింటా ఉప్పు ధర రూ.150 నుంచి 190 వరకు పలుకుతుంది. రోజుకు 50 లారీలు ద్వారా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఉప్పు నిల్వలు పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్న తమకు.. ఈటీవీ లో కథనం ప్రసారం కావటంతో ఉప్పు ఎగుమతులకు అనుమతి ఇచ్చారని ఈటీవీకి కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details