ప్రకాశం జిల్లా కొండెపికి చెందిన వేమూరు లక్ష్మీ కాంతమ్మ.. కె.ఉప్పలపాడులో బస్ షెల్టర్లో గత కొద్ది కాలంగా తలదాచుకుంటోంది. నలుగురు కుమారులు ఉన్నా, వివిధ కారణాల వల్ల వారు మృతి చెందడం, ఒక్కప్పుడు 70 ఎకరాల వరకు భూములు ఉన్నా అవన్నీ పంపకాల్లో కోల్పోవడం.. చివరికి చేతులో చిల్లి గవ్వ లేక, ఆదరించేవారు లేక.. కొండెపి కె. ఉప్పలపాడు బస్ షెల్టర్ లో ఉన్న తీరుపై.. ఈటీవీ భారత్ కథనాన్ని ప్రచురించింది. వెంటనే స్పందించిన ప్రకాశం జిల్లా న్యాయ మూర్తి జ్యోతిర్మయి.. న్యాయ సాధికారథ్ సంస్థ ద్వారా ఆ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించారు. ఒంగోలు నుంచి అధికారులను పంపించి.. అవ్వను వృద్ధాశ్రమనికి తరలించారు. సమస్యను వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన ఈటీవీ భారత్ ను స్థానికులు, అధికారులు అభినందించారు.
'ఈనాడు' కథనానికి స్పందన.... ఆశ్రమానికి చేరిన వృద్ధురాలు - latest news of prakasam dst old women bus shelter
లక్షల ఆస్తులు ఉన్నా అనాథలా బస్ షెల్టర్లో ఉంటున్న వృద్ధురాలి కథను ఈనాడు ఈటీవీ భారత్ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనానికి ప్రకాశం జిల్లా న్యాయమూర్తి స్పందించారు. ఆ అవ్వ సమస్య తీర్చారు.
వృద్ధురాలిని ఆశ్రమానికి పంపిస్తున్న అధికారులు
TAGGED:
ప్రకాశం జిల్లా వృద్దురాలి కథ