లాక్ డౌన్ కారణంగా కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు... ప్రకాశం జిల్లా యద్దనపూడిలోని వికాస తరంగిణి ప్రతినిధులు ఆపన్నహస్తం అందించారు.
యద్దనపూడికి చెందిన చిన్నజీయర్ స్వామి అనుచరులు... 16వ నెంబరు జాతీయ రహదారిపై వెళుతున్న వలస కూలీలకు రోజుకు 500 మందికి అన్న ప్రసాదాలు పంచి పెడుతున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు ప్రతిరోజు తమ సొంత నిధులతో అన్నార్తులకు సహాయం చేస్తామని చెప్పారు.